యూనియన్ బ్యాంకుకు భారీ జరిమానా
1 min read
పల్లెవెలుగు వెబ్: యూనియన్ బ్యాంకుకు షాకిచ్చింది ఆర్‌బీఐ. నిబంధనలు ఉల్లంఘించడంతో భారీ మొత్తంలో జరిమానా విధించింది. 2019కి సంబంధించిన స్టాట్యూటరీ ఇన్‌ఫెక్షన్ ఫర్ సూపర్‌వైజరీ ఎవాల్యూయేషన్‌ను ఆర్‌బీఐ ఇటీవల నిర్వహించింది. ఆర్‌బీఐ నిబంధనల్లో ప్రకారం ఏ బ్యాంకు అయిన సరే కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలు, లావాదేవీలకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడానికి వీల్లేదు. అయితే ఈ నిబంధనలను తుంగలోకి తొక్కింది యూనియన్ బ్యాంకు. దీంతో ఆర్బీఐ రూ.కోటి రూపాయాల జరిమానా విధించింది. తమ గైడ్‌లైన్స్ ప్రకారం నింబంధనలు పాటించలేదని.. ఇది తమ ఎవాల్యూయేషన్‌లో తేలినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే వార్షిక నివేదికలో భద్రతా రసీదుల (ఎస్‌ఆర్‌లు) కేటాయింపులను బహిర్గతం చేయడంలో యూనియన్ బ్యాంకు విఫలమైందని ఆర్‌బీఐ వెల్లడించింది. దీంతో రూ.కోటి రూపాయాల జరిమానా విధించామని దీనిపై ఈనెల 25లోపు స్పందించాలని ఆర్బీఐ సమన్లు జారీ చేసింది.