ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్రం కీలక ప్రకటన
1 min read
పల్లెవెలుగు వెబ్: ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు దడదడలాడిపోతున్నాయి. కరోనాకు సంబంధించి లేటెస్ట్ వేరియంటే.. ఒమిక్రాన్. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు. ‘‘ దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ కొత్త వేరియట్ కేసులు ప్రస్తుతం 14 దేశాల్లో నమోదు అవుతున్నాయి. ఒక వేళా ఈ కొత్త వేరియంట్ కేసులు మనదేశంలో వ్యాపిస్తే.. కట్టడి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.’’ అని కేంద్ర మంత్రి రాజ్యసభలో తెలిపారు. కాగా, నిన్న ఒమిక్రాన్ వేరియంట్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. డెల్టా వేరియంట్ కంటే చాలా ప్రమాదకరమని పేర్కొంది. ప్రపంచ దేశాలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.