ఏపీకి తుఫాను ముప్పు !
1 min readపల్లెవెలుగు వెబ్ :ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వణికిస్తున్నాయి. వరుస భారీ వర్షాలతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి ఎంతో మంది మరణించారు. ఎన్నో ఇళ్లు నేలకూలాయి. ఇప్పుడు మరోసారి తుఫాను హెచ్చరికలతో రైతన్న దిగాలుపడుతున్నాడు. దక్షిణ థాయ్‌లాండ్ వద్ద అండమాన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది అల్పపీడనంగా బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. మంగళవారం సాయంత్రం నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది డిసెంబర్ 2వ తేదీకి వాయుగుండంగా, 3వ తేదీకి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా బలపడితే దీనికి జవాద్ అని పేరు పెట్టనున్నారు. 4వ తేదీ నాటికి ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వైపు వచ్చి బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. 5, 6 తేదీల్లో తీవ్ర తుఫానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ReplyForward |