దేశంలోనే అతిపెద్ద మోసం.. ఛేదించిన తెలంగాణ పోలీస్
1 min readపల్లెవెలుగు వెబ్ : దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసాన్ని ఛేదించినట్టు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి.. దేశ వ్యాప్తంగా వందల కోట్లు వసూలు చేశారని తెలిపారు. ఎస్బీఐ ధనీ బజార్, లోన్ బజార్, లోన్ ఇండియా పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు ఆయన చెప్పారు. స్ఫూపింగ్ యాప్ ద్వార అసలైన ఎస్బీఐ కస్టమర్ కేర్ నుంచే ఫోన్ చేస్తున్నట్టు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్టు ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేశారని అన్నారు. ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 33 వేల కాల్స్ చేసి కోట్లు కాజేసినట్టు ఆయన తెలిపారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదైనట్టు చెప్పారు. ఎస్బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాలు తీసుకుని క్రెడిట్ కార్డుదారుల నుంచి డబ్బు కాజేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ యాప్ వాడకంలో ఫర్మాన్ హుస్సేన్ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించారని తెలిపారు. 1860 1801290 నెంబర్ నుంచి స్ఫపింగ్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ReplyForward |