సిమెంట్ ధరలకు రెక్కలు.. సామాన్యుడికి చుక్కలు !
1 min readపల్లెవెలుగు వెబ్ :సిమెంట్ ధరలకు రెక్కలు రాబోతున్నాయి. ధరలు మరింత ప్రియం కానున్నాయి. ముడిపదార్థాల ధరలు భారీగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం కూడ పెరుగుతోంది. ఫలితంగా సిమెంటు ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం 380 నుంచి 385 ఉన్న సిమెంటు బస్తా ధర త్వరలో 15 నుంచి 20 రూపాయలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే 50 కేజీల బస్తా సిమెంట్ ధర రూ. 400 చేరనుంది. సిమెంట్ తయారీలో ఉపయోగించే ప్రధాన ముడిపదార్థాలైన పెట్ కోక్, బొగ్గు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ధరలు పెంచాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి.