థియేటర్ల మూసివేత పై మంత్రి తలసాని స్పష్టత
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోన థర్డ్ వేవ్ వస్తుందని, థియేటర్లు మూసివేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. అలాంటి అసత్యాలు నమ్మొద్దని హితవు పలికారు. ప్రజలు ధైర్యంగా వెళ్లి థియేటర్లలో సినిమాలు చూడొచ్చని తెలిపారు. థర్డ్ వేవ్ వస్తోందన్న భయాలు మొదలయ్యాయని, భయాన్ని వదిలి సినిమా థియేటర్లకు ధైర్యంగా వెళ్లొచ్చని చెప్పారు. పరిశ్రమ పై ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయని అన్నారు. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. టికెట్ ధరల పెంపు అంశం పెండింగ్ లో ఉందని , సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.