వ్యాక్సిన్ వేసుకోకపోతే.. జీతంలో కోత !
1 min readపల్లెవెలుగు వెబ్ : తమిళనాడులోని మధురై మండల విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజినీర్ జారీ చేసిన సర్క్యులర్ సంచలనంగా మారింది. ఉద్యోగులు కరోన వ్యాక్సిన్ వేసుకోకపోతే డిసెంబర్ నెల జీతం కట్ చేస్తామంటూ సర్క్యులర్ జారీ చేశారు. ఈ విషయం వైరల్ కావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చీఫ్ ఇంజినీర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా భయాందోళన కలిగిస్తోన్న సమయంలో ఉద్యోగులు రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని సర్య్కులర్ జారీ చేశారు. దీని పై చీఫ్ ఇంజినీర్ ఉమాదేవి స్పందిస్తూ ఉద్యోగుల జీతాలు నిలిపే ప్రసక్తే లేదని, కేవలం రెండు డోసుల టీకా వేసుకోవాలన్న ఉద్దేశంతోనే సర్క్యులర్ జారీ చేసినట్టు ప్రకటించారు.