పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా.. కేంద్ర మంత్రి కొత్త ఆలోచన !
1 min readపల్లెవెలుగు వెబ్: పెట్రోల్, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా కొత్త ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడం తన లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డ్రైనేజి మురుగు నీరు, ఘనరూప వ్యర్థాల నుంచి హైడ్రోజన్ ను తయారుచేసి దాన్నే ఇంధనంగా ఉపయోగించే వీలుందని, ఈ తరహా హైడ్రోజన్ ఇంధనంతో వాహనాలను రోడ్లపై పరుగులు తీయించాలనేది తన ప్రణాళిక అని గడ్కరీ స్పష్టం చేశారు. నితిన్ గడ్కరీ ఈ మధ్య ఓ కారును కొనుగోలు చేశారట. ఇందులో ఇంధనంగా పెట్రోల్, డీజిల్, సహజవాయువులను ఉపయోగించరట. ఈ కారు గ్రీన్ హైడ్రోజన్‌తో నడుస్తుంది. ఫరిదాబాద్‌లోని ఓ ఆయిల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన కారును త్వరలో రోడ్డెక్కించబోతున్నట్లు ఓ సదస్సులో ఆయన స్వయంగా వెల్లడించారు.