ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన లక్షణాలు ఇవే !
1 min readపల్లెవెలుగు వెబ్ :కరోన వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. చాపకింద నీరులా పాకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన కరోన వేరియంట్లలో ఒమిక్రాన్ వేగంగా సంక్రమించే అంటువ్యాధిగా చెబుతున్నారు. ఇప్పటి వరకు సోకిన వారిలో కరోన సాధారణ లక్షణాలు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏంజలిక్ కోయెట్జీ ప్రకారం తలనొప్పి ,తీవ్రమైన అలసట, ఒళ్లు నొప్పులు ఒమిక్రాన్ సోకిన వారిలో ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ సోకినవారిలో అధికంగా జ్వరం రావటం, రుచి, సువాసనలు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడం లేదని కోయెట్జీ తెలిపారు.