ముగిసిన కార్తీకమాస శివ చతుస్సప్తాహ భజనలు
1 min readపల్లెవెలుగు వెబ్, శ్రీశైలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవంబరు 5వ తేదీన ప్రారంభమైన కార్తీక మాసోత్సవాలు డిసెంబరు 5వ తేదీతో ముగిశాయి. అందులో భాగంగా భక్త బృందాలు కార్తీకమాసమంత నిరంతరం అఖండ శివపంచాక్షరి నామభజన చేశారు. శివ ప్రణవపంచాక్షరి మంత్రమైన “ఓం నమ:శివాయ” భజన చేశారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భజన బృందసభ్యలు పరిమిత సంఖ్యలో మాత్రమే భజనలో పాల్గొనేలా చర్యలు తీసుకోవడం జరిగినది. ఈ భజనలో కర్నూలు జిల్లాకు చెందిన రెండు భజన బృందాలకు, ప్రకాశం జిల్లాకు చెందిన ఒక భజన బృందానికి మరియు కర్ణాటకకు చెందిన మూడు భజన బృందాలకు అవకాశం కల్పించబడింది. కాగా ఈ నాటి ముగింపు కార్యక్రమంలో భజన సందర్భంగా వీరశిరోమండపములో వేంచేబు చేయింపబడిన స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజాదికాలు జరిపించబడ్డాయి.