సమంత నేర్చుకున్న ‘పాఠం’ ఇదేనట !
1 min readపల్లెవెలుగు వెబ్ : నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేస్తోంది. తన మనసులోని భావాలు, అనుభూతులు పంచుకుంటోంది. తాను జీవితంలో నేర్చుకున్న పాఠం గురించి సమంత ఇన్ స్టాలో షేర్ చేసింది. మనిషి నిత్య విద్యార్థిగా ఉండాలంటారు. ఎంత నేర్చుకున్నా.. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ప్రముఖ హీరోయిన్ సమంత కూడ ఇదే అంటోంది. హీరోయిన్‌గానే కాదు వ్యక్తిగతంగా కూడా తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తోంది. ‘జీవితం నాకు నేర్పిన గొప్ప పాఠం ఏంటంటే.. నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది’ అని సమంత తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ షేర్ చేసింది.