అధికారంలోకి వస్తే.. ఉచితంగా ఇసుక !
1 min readపల్లెవెలుగు వెబ్ :ఇసుక పాలసీ పై జనసేన పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. జనసేన అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందిస్తామని హామి ఇచ్చారు. తీర ప్రాంత ప్రజలకు మంచి నీరు ఇవ్వడంలేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పంట అమ్ముకోవాలంటే రైతులు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఓటీఎస్ కోసం ఎంత మంది పై కేసులు పెడతారో చూస్తామంటూ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత.. ఇసుక ధరలు భారీగా పెరగడంతో నిర్మాణ రంగం కుదేలయింది. ఈ నేపథ్యంలో జనసేన ప్రకటించిన ఉచిత ఇసుక హామీ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.