PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యాక్సిన్​.. ఆరోగ్యానికి సురక్ష..

1 min read
వ్యాక్సిన్​ వేయించున్న ఎమ్మెల్యే తండ్రి అబ్దుల్​ మోహిజ్​ ఖాన్​

వ్యాక్సిన్​ వేయించున్న ఎమ్మెల్యే తండ్రి అబ్దుల్​ మోహిజ్​ ఖాన్​

నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోనా మహమ్మారి నివారణలో భాగంగా అర్హత ఉన్న ప్రతిఒక్కరూ కోవిడ్​ వ్యాక్సిన్​ వేయించుకోవాలని నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్​.. ఆరోగ్యానికి రక్ష.. అని సూచించిన ఎమ్మెల్యే… సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రతిలో తన తండ్రి అబ్దుల్ మోహిజ్ ఖాన్​కు , కుటుంబ సభ్యులకు కోవిడ్​ వ్యాక్సిన్​ వేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​ మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణలో భాగంగా ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. దేశ భవిష్యత్​ దృష్ట్యా.. ప్రతిఒక్కరూ మాస్క్​ ధరించాలని, శానిటైజర్​ ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చిన్నాన్న మాకబుల్, డాక్టర్ రవి కలదర్ రెడ్డి , వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author