సోషల్ మీడియా ప్రకటనలు నమ్మొద్దు : టీటీడీ
1 min readపల్లెవెలుగు వెబ్ :టీటీడీ పేరిట సోషల్ మీడియాలో వస్తున్న ఉద్యోగ ప్రకటనలు చూసి నమ్మొద్దని తిరుమల తిరుపతి దేవస్థానం హెచ్చరించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసపూరితంగా డబ్బులు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని టీటీడీ పేర్కొంది. ఇప్పటికే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని స్పష్టం చేసింది. టీటీడీలో ఉద్యోగాలు భర్తీ చేసే సమయంలో పత్రికల ద్వార, అధికారిక వెబ్ సైట్స్ ద్వార ప్రకటనలు విడుదల చేస్తామని తెలిపారు. అవాస్తవ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.