కిచిడీలో మత్తుమందు.. 17 మంది పై లైంగిక దాడి !
1 min readపల్లెవెలుగు వెబ్:ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలో దారుణ ఘటన జరిగింది. ముజఫర్ నగర్ జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడు విద్యార్థినులు తినే కిచిడీలో మత్తుమందు కలిపారు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డారు. పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కేసుకు సంబంధించిన పూర్తీ వివరాలు అందించాలని మెజిస్ట్రేట్ అధికారులను ఆదేశించారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ ప్రైవేటు పాఠశాల నిర్వాహకుడు ప్రాక్టికల్స్ నిమిత్తం మరో పాఠశాలకు తీసుకెళ్లాడు. ఆలస్యం అవుతుందనే కారణంతో అక్కడే బస చేయించాడు. విద్యార్థినులకు చేసిన కిచిడీలో మత్తు మందు కలిపి.. అనంతరం లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన 15రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే సహాకరంతో బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.