‘గంగవరం పోర్టు’లో అధిక వాటా అదానిదే…
1 min readవిశాఖ పట్నం సమీపంలో 1800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గంగవరం పోర్టులో మెజారిటీ వాటా దక్కించకుంది అదాని గ్రూపు. ఈ మేరకు ఈ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. డీవీఎస్ రాజు, ఆయన కుటుంబ సభ్యుల 58.1 శాతం వాటాను .. అలాగే విదేశీ పెట్టుబడుల సంస్థ వార్ బర్గ్ పింకస్ కు చెందిన 31.5 శాతం వాటాను అదాని పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ కంపెనీ కొనుగోలు చేసింది. దీంతో అదాని గ్రూపు మొత్తం వాటా 89.6 శాతానికి చేరింది. మిగిలిన 11.4 శాతం వాటా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పటికే అదాని గ్రూపు కృష్ణపట్నం పోర్టులో కూడ మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ సముద్ర తీర ప్రాంతంలో అత్యధిక వాటా సొంతం చేసుకున్న క్రియాశీలక సంస్థగా అదాని పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ ఆవిర్భవించింది. గంగవరం పోర్టు ఆంధ్ర ప్రదేశ్ లోనే అతిపెద్ద రెండవ నాన్-మేజర్ పోర్టు. దీని సామర్థ్యం సంవత్సరానికి 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్లో అయిన రవాణ చేయగల సామర్థ్యం ఈ పోర్టుకు ఉంది. తూర్పు, పడమర, దక్షిణ , మధ్య భారత దేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు రవాణ జరుగుతుంది.