PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ ఇంటి క‌రెంట్ బిల్లు ఇలా త‌గ్గించుకోండి !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : సీజ‌న్ తో సంబంధం లేకుండా క‌రెంటు బిల్లులు సామాన్యుడి జేబు గుల్ల చేస్తాయి. గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల వాడ‌కంతో క‌రెంటు వాడ‌కం కూడ పెరిగింది. దీంతో క‌రెంటు బిల్లులు మోత మోగిస్తున్నాయి. అదే స‌మ‌యంలో మ‌న‌కు తెలియ‌ని కొన్ని విష‌యాల వ‌ల్ల అధికంగా క‌రెంట్ వినియోగిస్తుంటాం. క‌రెంటు బిల్లుల పోటు త‌గ్గాలంటే కొన్ని సూచ‌న‌లు పాటించాల‌ని నిపుణులు చెబుతున్నారు. సెల్ ఫోన్, ల్యాప్ టాప్, గ్రైండ‌ర్, ఫ్రిజ్, కూల‌ర్, వాషింగ్ మిష‌న్ ఇలా ఏది తీసుకున్నా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే క‌రెంటు వినియోగం త‌గ్గించ‌వ‌చ్చు.  కొన్ని ఎలక్ర్టానిక్ డివైజ‌స్ ఆఫ్‌లో ఉన్నా కూడా  ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి. సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ల మొదలు..  వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్‌లు, ఐరన్‌బాక్స్లు, వాషింగ్‌మెషీన్‌, ల్యాప్‌ట్యాప్‌లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్‌లో ఉన్నప్పుడు కరెంట్‌ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్‌ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్‌బై మోడ్‌ ఆప్షన్‌తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్‌ను లాగేస్తున్నాయి. కాబ‌ట్టి ప్లగ్ నుంచి పూర్తీగా తొల‌గిస్తే క‌రెంట‌న్ చార్జీల‌ను సేవ చేయొచ్చని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు.

About Author