అధికారంలోకి వచ్చాక.. ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ !
1 min readపల్లెవెలుగు వెబ్:టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రకటించారు టీడీపీ నేత నారా లోకేష్. ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎవరూ భయపడొద్దని సూచించారు. దేశంలోని అభివృద్ధి నిరోధక ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ ముందుంటారని తెలిపారు. సీఎం నివాసానికి సమీపంలో విచ్చలవిడిగా మత్తుపదార్థాల సరఫరా జరుగుతుంటే… అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటే రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.