PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుప్రీం తీర్పు.. ఊపిరి పీల్చుకున్న బ్యాంకులు

1 min read

రుణ మార‌టోరియం మీద సుప్రీం కోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. మార‌టోరియం కాలానికి వ‌డ్డీ పూర్తీగా మాఫీ చేయాల‌ని, రుణ మార‌టోరియం కాలాన్ని పొడిగించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్లను సుప్రీం కోర్టు మంగ‌ళ‌వారం విచారించింది. ఈ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీప‌న‌లు ప్రక‌టించాల‌ని ప్రభుత్వాన్ని ఆదేశించ‌లేమ‌ని పేర్కొంది. రుణ మార‌టోరియం కాలానికి వ‌డ్డీ మీద వ‌డ్డీ మాఫీ చేయాల‌ని కోరింది. ఒక‌వేళ ఇప్పటికే వ‌డ్డీ మీద వ‌డ్డీ వ‌సూలు చేసి ఉంటే.. దానిని రుణ గ్రహీత‌ల‌కు స‌ర్దుబాటు చేయాల‌ని ఆదేశించింది. ఆగ‌స్టు 2020 వ‌ర‌కు ఉన్న మార‌టోర‌యం కాలాన్ని పొడిగించ‌మ‌ని కేంద్రాన్ని ఆదేశించ‌లేమ‌ని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 కోట్ల వ‌ర‌కు ఉన్న రుణాల మీద చ‌క్ర వ‌డ్డీ మాఫీ చేసిన విష‌యాన్ని గుర్తు చేసింది. ఆర్థిక‌ప‌ర‌మైన నిర్ణయాల్లో న్యాయ‌స‌మీక్ష చేయ‌లేమ‌ని స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులు ఊపిరిపీల్చుకున్నాయి. ఎన్ పీఏ ల భారంతో కొట్టుమిట్టాడుతున్న బ్యాంకుల‌కు సుప్రీం కోర్టు తీర్పు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నుంది. రుణ మార‌టోరియం కాలాన్ని పొడిగించి… పూర్తీ వ‌డ్డీ క‌నుక మాఫీ చేసి ఉంటే.. బ్యాంకులు దివాళ తీసే ప‌రిస్థితి ఉండేది. బ్యాంకుల‌కు నాన్ ప‌ర్ పార్మింగ్ అసెట్ లు గుట్టలుగా పెరిగిపోయి.. బ్యాంకు ఆదాయాల‌ను భారీగా దెబ్బతీసేవి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న బ్యాంకులు ఏకంగా దివాళ తీసేవి.

About Author