NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంకు హైకోర్టు ప్రశంస‌లు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: త‌మిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ ను ప్రశంసించింది. స్టాలిన్ పై విమ‌ర్శలు చేయ‌డాన్ని ఆపాల‌ని సాట్టై మురుగ‌న్ అనే వ్యక్తికి మ‌ద్రాసు హైకోర్టు మధురై ధ‌ర్మాసనం హెచ్చరించింది. మ‌ధురైకి చెందిన సాట్టై మురుగ‌న్ స్టాలిన్ పై గ‌తంలో ప‌లు విమ‌ర్శలు చేశారు. దీంతో ఆయ‌న పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. జామీను కోరుతూ సాట్టై మురుగ‌న్ మ‌దురై ధ‌ర్మాసనంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి పుళ‌గేంది కీల‌క వ్యాఖ్యలు చేశారు. సీఎం స్టాలిన్ త‌న క‌ర్తవ్యాన్ని చ‌క్కగా నిర్వర్తిస్తున్నార‌ని అన్నారు. అభినందించ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ.. ఆయ‌న‌ను విమ‌ర్శించ‌డాన్ని కోర్టు స‌హించ‌ద‌న్నారు. త‌మిళ‌నాడు ప్రభుత్వం ఏ తప్పులు చేస్తే గుర్తించార‌ని ప్రశ్నించారు.

About Author