NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గాడిద పాల‌తో క‌రోనకు చెక్ ?!

1 min read

పల్లెవెలుగు వెబ్​ :గాడిద పాల వ్యాపారం మ‌హారాష్ట్రలోని హింగోలిలో జోరుగా సాగుతోంది. గాడిద పాల విక్రేత‌లు రోజుకో కొత్త ప్రచారంతో దండిగానే సంపాదిస్తున్నారు. గాడిద పాల‌లో ఔష‌ధ గుణాలు పుష్కలంగా ఉంటాయ‌ని, చిన్నపిల్లల‌కు చాలా మంచిదంటూ ప్రచారం చేస్తున్నారు. జ‌లుబు, జ్వరం, క‌రోన , దగ్గు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంద‌ని, గాడిద పాల‌తో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరుగుతుందంటూ ప్రచారం జ‌రుగుతోంది. దీంతో లీట‌ర్ గాడిద పాల ధ‌ర గ‌రిష్ఠంగా 10 వేలు ప‌లుకుతోంది.  అనేక వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుందని టీస్పూన్ పాలను రూ. 100కు, ఒక లీటరు పాలు ఏకంగా రూ. 10,000లకు అమ్ముతున్నారు. పుట్టిన బిడ్డకు 3 సంవత్సరాల వరకు రోజూ ఈ పాలను తాగిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే ప్రచారం కొనసాగుతోంది.

 వైద్యులు ఏం చెబుతున్నారంటే :
గాడిద పాలు పేరుతో జ‌రుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమ‌ని, గాడిద పాలు తాగడం వల్ల కరోనా లాంటి ఇన్ఫెక్షన్లు నయమవుతాయనేది అసాధ్యమని డాక్టర్ వీఎన్ రోడ్జ్ తెలిపారు.  ఇలాంటి వదంతులకు మోసపోవద్దని డాక్టర్‌ వీఎన్ రోడ్జ్ చెబుతున్నారు. వైద్యుల సలహా మేరకే మందులు వాడాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రజలు తమ డబ్బును వృధాగా ఖర్చు చేసుకోవద్దని సూచించారు.

About Author