ఫోర్బ్స్ జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
1 min readపల్లెవెలుగు వెబ్: ఫోర్బ్స్ 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిలిచారు. 2021 సంవత్సరంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 37 వ స్థానంలో నిలిచారు. ఆమె 2020లో 41వ స్థానం, 2019లో 34వ స్థానంలో ఉన్నారు. భారతదేశానికి తొలి పూర్తి స్థాయి ఆర్థికమంత్రి అయిన నిర్మల ఈ జాబితాలో స్థానం పొందడం వరుసగా ఇది మూడో సంవత్సరం. అమెరికా ఆర్థికమంత్రి జానెట్ ఎల్లెన్ కన్నా ఆమె రెండు స్థానాలు పైన ఉన్నారు. ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ నైకా అధినేత్రి ఫల్గుణి నాయర్ తొలిసారిగా ఫోర్బ్స్ జాబితాలోకి చేరారు.