వైఎస్ షర్మిల అరెస్ట్ !
1 min readపల్లెవెలుగు వెబ్ :వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలం బొగుడు భూపతి పూర్ లో షర్మిల దీక్షకు కూర్చున్నారు. ముందుగా షర్మిల దీక్షను భగ్నం చేశారు. షర్మిల సహా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు షర్మిల దీక్ష కొనసాగింది. అంతకుముందు షర్మిల మాట్లాడుతూ రైతు రవి కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చేవరకూ దీక్ష కొనసాగుతుందన్నారు. అప్పటి దాకా ఇక్కడ నుంచి కదిలేది లేదన్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.