తిక్కా రెడ్డి పై దాడి.. చంద్రబాబు ఆగ్రహం
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా కోసిగిలో తిక్కారెడ్డి పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. బొంపల్లె ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డి పై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్టు వివరించారు. గత ఏడాది ఫిబ్రవరిలో కూడ తిక్కారెడ్డి పై దాడి జరిగినా ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించకపోవడం సిగ్గుచేటన్నారు. తిక్కారెడ్డికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాద్యత వహించాలని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.