కరోన వేళ.. భారత్ కు ఊరటనిచ్చే అంశం !
1 min readపల్లెవెలుగు వెబ్: ఒమిక్రాన్ వేరియంట్ తో మరోసారి కరోన భయం పట్టుకుంది. మూడో వేవ్ తప్పదని కూడ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత దేశానికి ఊరటనిచ్చే అంశం సీరోపాజిటివిటి. సీరోపాజిటివిటి రేటు వల్ల భారతీయులు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం 70 నుంచి 80 శాతం సీరోపాజిటివిటి కలిగి ఉందని, దేశానికి ఇదో సానుకూల అంశమని సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. నగరాల్లో 90 శాతం ప్రజలు ప్రతినిరోధకాలు కలిగి ఉన్నారని తెలిపారు. ఒకవేళ వ్యాధి బారినపడ్డా కూడ లక్షణాలు స్వల్పంగా ఉంటాయని తెలిపారు.