ఆంధ్రాలో తొలి ఒమిక్రాన్ కేసు !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఐర్లాండ్ నుంచి ముంబయి మీదుగా విశాఖపట్నం వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా.. అతనికి కరోన పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అతని నమూనాను సీసీఎంబీకి పంపగా ఒమిక్రాన్ గా తేలింది.