యువత..దేశభక్తిని పెంపొందించుకోవాలి
1 min read– రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పిచ్చయ్య చౌదరీ
‘షహీది దివస్’ సందర్భంగా కడపలో రక్తదాన శిబిరం
కడప: భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ల ప్రాణ త్యాగం చేసి నేటికి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ నెహ్రు యువ కేంద్రం, రెడ్ క్రాస్, కడప జిల్లా సేవా సంస్థలు ఆధ్వర్యంలో కడప రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పిచ్చయ్య చౌదరీ , జిల్లా యువజన సర్వీసుల శాఖ చీఫ్ ఎగ్జైక్యూటి ఆఫీసర్ రామ చంద్రా రెడ్డి , నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి మణికంఠ పాల్గొని రక్తదానం చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత దేశ భక్తిని పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో సేఫ్ ఇండియా సంస్థ చైర్మన్ సమీర, మీకోసం సేవా సంస్థ విష్ణు వర్ధన్, బ్లెస్సి ఫౌండేషన్ అధ్యక్షుడు పుల్లగూర శ్రీనివాసులు అమ్మ సేవాసమితి అధ్యక్షుడు వాగ్దాడం శివ శంకర్, బ్లడ్ టూ లివ్ సేవా సంస్థ పట్టుపోగు ల పవన్ కుమార్, ఆకాంక్ష సేవా సమితి కొన్నే పాటి శ్రీనివాస్, సహస్ర ఫౌండేషన్ నాగ మల్లారెడ్డి, సరయు సేవా సంస్థ రామయ్య, కే ఎస్ ఆర్ ఎం కాలేజీ అధ్యాపకులు, మేధా కళాశాల అధ్యాపకులు పెద్దయ్య, స్టెప్ సిబ్బంది, నెహ్రు యువ కేంద్రం సిబ్బంది, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.