చైనా సరిహద్దుల్లో.. గ్రామాలు ఖాళీ !
1 min readపల్లెవెలుగు వెబ్: భారత్ వైపు ఉన్న చైనా _నేపాల్ సరిహద్దుల్లో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. వేలాది మంది ప్రజలు వలస వెళ్లి పోతున్నారు. ఉత్తరాఖండ్ లోని పిథోరాగడ్ జిల్లాలో ఇప్పటికే 59 గ్రామాలు ఖాళీ అయ్యాయి. పిథారోగడ్ జిల్లాలో ప్రస్తుతం 1542 గ్రామాల్లో మాత్రమే ప్రజలు ఉన్నారు. మూడేళ్ల క్రితం 1601 గ్రామాల్లో ప్రజలు ఉన్నారు. మొత్తం 59 గ్రామాలు ఖాళీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడి 21 సంవత్సరాలు గడుస్తోంది. అభివృద్ధి కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా సరే కనీస సౌకర్యాలు కూడా లేవు. విద్య, వైద్యం, సమాచారం, కరెంట్, రోడ్లు ఇలా ఎన్నో అసౌకర్యాల నడుమ ప్రజలు జీవిస్తున్నారు. దీంతో చాలా మంది ప్రజలు ఆ ప్రాంతాల నుంచి వలసపోతున్నారని అధికారులు చెబుతున్నారు.