NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హిందూ సమాజం.. సంఘటితం కావాలి

1 min read

ఏపీ విశ్వహిందూ పరిషత్  సంఘటన మంత్రి శ్రీనివాసరెడ్డి….

పల్లెవెలుగు వెబ్ , కర్నూలు​: కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కార్యన్మోఖుణ్ణి చేయడం కోసం ఉద్భవించిన పవిత్ర భగవద్గీతా జయంతి రోజున శౌర్యసంచలన్ జరగడం సంతోషదాయకమన్నారు ఏపీ విశ్వహిందూ పరిషత్  సంఘటన మంత్రి శ్రీనివాసరెడ్డి. మంగళవారం నగరంలోని స్వామి  వివేకానంద సంస్కృత పాఠశాలలో శౌర్య  సంచలన సభ జరిగింది. అంతకు ముందు స్వామి వివేకానంద సంస్కృత పాఠశాల నుండి మొదలైన శౌర్య సంచలనం పెద్దమార్కెట్, గడియారం ఆసుపత్రి, బొంగుల బజార్, కాంగ్రెస్ ఆఫీస్, కోట్ల సర్కిల్ మీదుగా గవర్నమెంట్ ప్రెస్, కొండారెడ్డి బురుజు, అంబేద్కర్ సర్కిల్, మున్సిఫ్ కోర్టు మీదుగా తిరిగి సంస్కృత పాఠశాలలు చేరుకుంది.  అనంతరం ప్రారంభమైనభలో  సభాధ్యక్షులుగా శ్రీ భగవాన్ బాలసాయి ఆశ్రమట్రస్ట్ కన్వీనర్,  విశ్వహిందూ పరిషత్ అఖిలభారత కేంద్రం ట్రస్టీ రామారావు మాట్లాడారు.  హిందూ సమాజాన్ని సంఘటితంగా ఉంచడం కోసం ఇటువంటి కార్యక్రమాలు జరగడం ఆవశ్యకమని అన్నారు.

కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకట్రామయ్య,రాష్ట్ర సహ కార్యదర్శి యస్.ప్రాణేష్,, బజరంగ్దళ్ కన్వీనర్ ప్రతాపరెడ్డి,ధర్మప్రసార్ కన్వీనర్ ఏ.వీ.ప్రసాద్, విభాగ్ కార్యదర్శి , సుబ్రహ్మణ్యం, బజరంగ్ దళ్ కన్వీనర్  నీలి నరసింహ, జిల్లా కార్యాధ్యక్షులు కృష్ట‌న్న, కార్యదర్శి విజయుడు, జిల్లా బజరంగ్దళ్ కన్వీనర్ రాజేష్, అధ్యక్షులు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, కార్యాధ్యక్షులు , గోరంట్ల రమణ, కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, బజరంగ్దళ్ కన్వీనర్ ప్రసన్నకుమార్, సాప్తాహిక్ మిలన్ కన్వీనర్ సాయిరాం, ప్రఖంఢ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.

 

About Author