బ్రహ్మ విద్యకు.. బ్రహ్మరథం
1 min readతితిదే ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా గీతా జయంతి వేడుకలు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ మద్భగవద్గీత జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా కర్నూలు నగరం సి.క్యాంపు లోని తిరుమల తిరుపతి దేవస్థానములు కళ్యాణ మండపం నుండి బి.క్యాంపు విజ్ఞాన మందిరం మీదుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీమద్భగవద్గీత గ్రంథాన్ని రథంలో ఉరేగిస్తూ, కోలాట, భజన, నృత్య బృందాలచే అత్యంత వేడుకగా శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భగవద్గీత కంఠస్థ పఠన పోటీల్లో విజేతలైన వారికి తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి బహుమతులతోపాటు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం శారదా జ్ఞాన పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ శివ యోగేంద్ర సరస్వతి స్వామి మాట్లాడారు. ఆ తరువాత లలితా పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గురు మేడ సుబ్రహ్మణ్యం స్వామి, , దేవాదయ ధర్మాదయ శాఖ సహాయ కమిషనర్ కాకర్ల ఆదిశేష నాయుడు, శ్రీ లక్ష్మీ పాఠశాల కరస్పాండెంట్ శ్రావ్యా కార్తీక్ లు జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు.
కార్యక్రమంలో గోదావిష్ణు సహస్రనామ పారాయణ బృందం వేమూరి జనార్ధన్ పుల్లయ్య, ప్రసాద్, తరిగొండ వెంగమాంబ సేవాసమితి అధ్యక్షురాలు పసుపులేటి నీలిమ, లలిత పారాయణ సంఘం అధ్యక్షురాలు జ్ఞానేశ్వరమ్మ, గీతా ప్రచార సంఘం కార్యదర్శి అనంత అనిల్ కుమార్, శ్రీవారి మాతృ మండలి యనమండ్ర ఉమాదేవి, విరివింటి విజయలక్ష్మి , పి. సుభాషిని, ఎస్. శ్రీవాణి, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య అకాడమీ వ్యవస్థాపకులు బి.నాగమల్లీశ్వరి,బి. దేవిశ్రీ, వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.