ప్రభుత్వ ఉద్యోగాల్లో.. కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు చేయాలి !
1 min readపల్లెవెలుగు వెబ్ :ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లు రద్దు చేయాలని హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , బీజేపీ సీనియర్ నాయకుడు శాంతకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కుల ఆధారిత కోటా వ్యవస్థను పూర్తిగా రద్దుచేసి, కుటుంబ ఆదాయం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. కుల ఆధారిత రిజర్వేషన్లపై దేశంలో 80 శాతం మంది విసుగెత్తిపోయారని అన్నారు. రిజర్వుడ్ కులాల్లోని పేదలు రిజర్వేషన్లతో పూర్తి లబ్ధి పొందలేకపోతున్నారని చెప్పారు.