దేశంలో గూగుల్, ఫేస్ బుక్ సంపాదిస్తోన్న ఆదాయం ఎంతో తెలుసా ?
1 min read
15/12/2021
పల్లె వెలుగు వెబ్ : సంప్రదాయ మీడియాలో వచ్చే వార్తలను హోస్ట్ చేయడం ద్వార గూగుల్, ఫేస్ బుక్ భారీగా సందపాదిస్తోన్నట్టు పార్లమెంట్ వేదికగా గణాంకాలు బయటపడ్డాయి. భారత్‌లో డిజిటల్ ప్రకటనల విపణిలో 75 శాతం వాటాను గూగుల్, ఫేస్‌బుక్ హస్తగతం చేసుకున్నాయని, ఏడాదికి గూగుల్ ఏకంగా రూ.13,887 కోట్లు, ఫేస్‌బుక్ రూ.9,326 కోట్లు పొందుతున్నాయని రాజ్యసభలో సుశీల్ మోదీ వెల్లడించారు. అంటే మొత్తంగా రెండు సంస్థలకు కలిపి రూ.23,313 కోట్లు సంపాదిస్తున్నాయి. ఇది దేశంలోని టాప్–10 సంప్రదాయక మీడియా సంస్థల మొత్తం ఆదాయం కంటే చాలా ఎక్కువ అని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ వివరించారు.