మృత్యువుతో పోరాడి ఓడిన కెప్టన్ వరుణ్ సింగ్
1 min read
పల్లె వెలుగు వెబ్ : తమిళనాడు కున్నూరు వద్ద ఇటీవల జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ తో సహా 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో కెప్టన్ వరుణ్ సింగ్ ఒక్కరే తీవ్ర గాయాలతో బయటపడ్డారు. బెంగళూరు కమాండ్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ కెప్టన్ వరుణ్ సింగ్ బుధవారం మృత్యువుతో పోరాడుతు మరణించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించింది.

