పల్లె వెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన, యూఎస్ ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఐటీ, ఫార్మా, రియాల్టీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కనపడగా.. ఆటో స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మధ్యాహన్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 260 పాయింట్ల నష్టంతో 57856 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 17239 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 60 పాయింట్ల స్వల్ప లాభంతో 36955 వద్ద ట్రేడ్ అవుతోంది.