పల్లె వెలుగు వెబ్ : కరోన పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల పై దెబ్బకొట్టింది. సంఘటిత రంగం మొదలుకొని అసంఘటిత రంగం వరకు అన్ని వర్గాలను రోడ్డు పైన పడేసింది. తీవ్ర నష్టాలతో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోగా.. చిన్నాచితకా సంస్థలు మూతబడే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టి మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటున్నా.. ఉపాధి అవకాశాలు మాత్రం ఆశించినంతగా పెరగడం లేదు. ప్రస్తుతం ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు నిరుద్యోగిగా ఉన్నట్లు గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ పరిశీలన చెబుతోంది. కరోన ముందుస్థాయికి చేరుకోవడంలో ఆలస్యం జరుగుతున్న కారణంగా ఉపాధి అవకాశాలు పెరగడం లేదని నివేదిక పరిశీలనలో తేలింది. కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్న కారణంగా నిరుద్యోగం పెరిగినట్టు తెలుస్తోంది.