పల్లెవెలుగువెబ్: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `పుష్ప`. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 17న ఏడు భాషల్లో పుష్ప సినిమా విడుదల అవుతోంది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడైన ఇతడు పుష్ప చిత్రం ఫస్ట్ హాఫ్ చూసి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. సినిమా మొత్తం చూశాక 'పుష్ప' ఈ ఏడాదిలోనే ఉత్తమ టాలీవుడ్ చిత్రంగా నిలుస్తుందని జోస్యం పలికారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. బన్నీని సరికొత్త అవతారంలో చూసి ఆయన ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని పేర్కొన్నారు. దీంతో టాలీవుడ్ లో సినిమా పై అంచనాలు పీక్స్ కు చేరాయి.