కొన్నిరోజులు కలిసుంటే సహజీవనమా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : ఇద్దరు యవతీయువకులు కొన్ని రోజులు కలిసుంటే అది సహజీవనం కాదని పంజాబ్, హరియాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులు, బంధువులు నుంచి రక్షణ కల్పంచాలని ఓ ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పిటిషన్ తిరస్కరించింది. పిటిషన్ వేసిన జంటకు 25 వేల జరిమానా విధించారు. యమునానగర్ కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి, 20 ఏళ్ల అబ్బాయి కొన్నిరోజుల నుంచి నవంబర్ 24 నుంచి ఓ హోటల్ గదిలో సహజీవనం చేస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువుల నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్ వేశారు. దీంతో కోర్టు పిటిషన్ తిరస్కరించింది.