నష్టాల్లో సూచీలు
1 min read
పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో 57262 వద్ద, నిఫ్టీ 196 పాయింట్ల నష్టంతో 17051 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 653 పాయింట్ల నష్టంతో 35894 వద్ద ట్రేడ్ అవుతోంది.