ఇంటర్నెట్ పై కార్పొరేట్ల ఆధిపత్యం ఉండబోదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఇంటర్నెట్ ను మంచికి వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తీ మద్దతు ఇస్తోందని కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఇంటర్నెట్ పై బడా కార్పొరేట్ల ఆధిపత్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ ఎప్పటికీ స్వేచ్చాయుతంగానే ఉంటుందన్నారు. వందకోట్లకు పైగా భారతీయులు ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నందున దీన్ని భద్రమైన, విశ్వసనీయమైన సాధనంగా ఉండేలా చూడనున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ణు మంచికోసం వినియోగించేలా చూసేందుకు ప్రైవేటు కంపెనీలు, దేశ, విదేశీ సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కలసి పనిచేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.