PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న‌రాల బ‌లహీన‌త త‌గ్గాలంటే ఇదే స‌రైన ఆహారం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న‌రాల బ‌ల‌హీన‌త త‌గ్గాలంటే కొన్ని పోష‌కాలు శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. వాటిని స‌మృద్ధిగా ఆహారంలోకి చేర్చుకుంటే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఒమేగా-3 ఫాటీయాసిడ్స్‌ అధికంగా ఉండే చేపలు, అవిసెగింజలు, ఆక్రోట్‌ గింజలు రోజూ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్‌, పాలీఫీనాల్స్‌ అనే పదార్థాలుండే ముదురు రంగుల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు నరాల ఆరోగ్యానికి మంచిది. రోజూ 150-200 గ్రాముల పండ్లు, 200 గ్రాముల కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. పసుపులోని కర్క్యుమిన్‌, గ్రీన్‌ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ కూడా నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం, వేపుళ్ళు, నూనెలో వేయించిన ఆహారం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, చక్కెర, స్వీట్లు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

                                
                        

About Author