PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పుష్ప సాంగ్ పై రాజాసింగ్ ఫైర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పుష్ప సినిమాలోని ఊ అంటావా.. ఊఊ అంటావా మావ సాంగ్ పై వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. ఈ పాట మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం కోర్టు కెక్కింది. దీనిపై గీతరచయిత చంద్రబోస్‌ క్షమాపణ చెప్పినా వివాదం సద్దు మణిగినట్టు కనిపించడం లేదు. అంతేకాదు ఆల్‌ ఐటెం సాంగ్స్‌ డివోషనల్‌ సాంగ్సే.. అంటూ ఆ ట్యూన్‌లో భక్తిగీతం పాడి తన ధోరణిని సమర్ధించుకోవడం పెద్ద దుమారాన్ని రాజేస్తోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు ఐటెం నెంబర్లూ దేవుడి పాటలూ రెండూ ఒకటేనా? హిందూ సమాజానికి దేవిశ్రీ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అగ్గి గుగ్గిలమయ్యారాయన.

                           
                         

About Author