క్రిప్టో నిషేధించడమే మేలు !
1 min readపల్లెవెలుగువెబ్ : క్రిప్టో కరెన్సీని పూర్తీగా నిషేధించడమే మేలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడినట్టు సమాచారం. క్రిప్టోకరెన్సీలపై పాక్షిక ఆంక్షలు ఫలితాలు ఇవ్వబోవని ఆర్బీఐ బ్యాంకు బోర్డు సమావేశంలో పేర్కొన్నట్లు సమాచారం. క్రిప్టోలపై ఆర్బీఐ వైఖరిని సెంట్రల్ బోర్డు కూడా సమర్థించినట్లు తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీలను తీవ్రమైందిగా భావించాలని ఆర్బీఐ గవర్నర్ ఈ సమావేశంలో వెల్లడించారు. క్రిప్టో ఆస్తులను నియంత్రించడం కష్టంతో కూడుకున్న పని అని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో కొందరు సభ్యులు బ్యాలెన్స్‌డ్ విధానాలను అనుసరించాలని కోరారు. క్రిప్టో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎటువంటి వైఖరిని వెల్లడించలేదని తెలుస్తోంది.