బ్యాంకుల్లో వాటా తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా తగ్గించునే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కనీస వాటాను 51 శాతం నుంచి 26 శాతానికి తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోందని సమాచారం. ఇందుకోసం బ్యాంకుల జాతీయకరణ చట్టంలో తగిన సవరణలు చేయాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో యాజమాన్య నియామకాలపై నియంత్రణ కోల్పోకుండా జాగ్రత్తపడుతూ, తన వాటాను 51 శాతం నుంచి క్రమంగా 26 శాతానికి తగ్గించుకునేందుకు వీలు కానుంది. అంతేకాదు, భవిష్యత్లో ప్రభుత్వానికి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ప్రైవేటీకరణ సులువు కానుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో విదేశీ ఇన్వెస్టర్లు 20 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతించాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.