రాజకీయంగా రాణించే పార్టీలకే… ‘పద్మశాలీయు’ల మద్దతు
1 min read- రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మి నారాయణ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రపంచ వ్యాప్తంగా చేనేతలకు మంచి గుర్తింపు ఉందని, దేశ జనాభాలో అధికశాతంగా ఉన్న పద్మశాలియులను రాజకీయంగా రాణించే పార్టీలకే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామన్నారు రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మినారాయణ. ఆదివారం కర్నూలు జిల్లా కేంద్రంలోని దేవి ప్యారడైజ్లో రాయలసీమ ప్రాంత పద్మశాలియుల 7వ మహా సభలు జరిగాయి.
ఈ మహాసభలకు కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పద్మశాలియులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షులుగా కొంకతి లక్ష్మినారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం కొంకతి లక్ష్మినారాయణ విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పద్మశాలియులు అధికంగా ఉన్నారని, భవిష్యత్లో రాజకీయంగా రాణించే వారికే సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించుకుంటామన్నారు. చేనేత వర్గాల్లో ఉన్నత చదువులు చదివి… వివిధ రంగాల్లో స్థిరపడి అత్యుత్తమ హోదాలో ఉన్నారని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పద్మశాలీయులకు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాలని ఈ సందర్భంగా కొంకతి లక్ష్మి నారాయణ డిమాండ్ చేశారు.