PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివాహంతో ఒక్క‌టైన స్వ‌లింగ సంప‌ర్కులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్వ‌లింగ సంప‌ర్కులు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. హైదరాబాద్ లో మొయినాబాద్ లోని ఓ రిసార్ట్ వీరి పెళ్లి వేడుకకు వేదికైంది. స్నేహితులు, త‌ల్లిదండ్రులు, సన్నిహితుల స‌మ‌క్షంలో సుప్రియో చ‌క్ర‌వ‌ర్తి, అభ‌య్ డాంగ్ ఒక్క‌ట‌య్యారు. కోల్ క‌తాకు చెందిన సుప్రియో చ‌క్ర‌వ‌ర్తి టీచ‌ర్ గా, ఢిల్లీకి చెందిన అభ‌య్ డాంగ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ప‌నిచేస్తున్నారు. 2012లోనే తామిద్ద‌రికి ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని, నెల క్రితం వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఈ జంట తెలిపారు. పెళ్లి విష‌యం చెప్ప‌గానే త‌ల్లిదండ్రులు ఒప్పుకున్నార‌ని, మిత్రుల‌కు చెబితే మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింద‌ని తెలిపారు. త‌మ వివాహానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేకున్నా వేడుక‌గా ఒక్క‌టి కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు.

                                               
            

About Author