ఐశ్వర్యరాయ్ కు ఈడీ సమన్లు
1 min readపల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ ఆఫీసుకు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వాలని ఐశ్వర్యరాయ్ ను కోరింది. నివేదికల ప్రకారం దీని గురించి మరో తేదిన ప్రశ్నించాలని ఐశ్వర్య రాయ్ కోరినట్టు సమాచారం. మనీ లాండరింగ్ చట్టం 2002 కింద ఐశ్వర్యరాయ్ పై ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పనామా పేపర్స్ లీకేజీ.. 2016లో సంచలనం సృష్టించిన విషయాల్లో ఇదొకటి. ఇందులో భాగంగా దాదాపు 11.5 మిలియన్ల రహస్య డాక్యుమెంట్లు లీకైయ్యాయి. దీంతో 2,14,488 కంపెనీల బండారం బయటపడింది. అప్పట్లో ఎంతోమంది ప్రముఖులను ఈ కేసుకి సంబంధించి మనీలాండరింగ్ విషయాల గురించి ఈడీ ప్రశ్నించింది .