నంద్యాలలో కాల్ మనీ కలకలం !
1 min read
పల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా నంద్యాలలో కాల్ మనీ కలకలం రేగింది. ఓ దంపతులు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నంద్యాల జగజ్జననీ నగరలో ఈ ఘటన జరిగింది. అధిక వడ్డీలు కట్టలేక దంపతులు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యయత్నానికి అప్పుదారుల వత్తిడే కారణమని బంధువులు చెబుతున్నారు. అధిక వడ్డీలపై లెటర్ రాసి నూర్ భాషా, షాహిన్ దంపతులు ఈ అఘాయిత్యానికి యత్నించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.