పెట్రోల్, డీజిల్ నుంచి కేంద్రానికి 4.55 లక్షల కోట్ల ఆదాయం !
1 min readపల్లెవెలుగువెబ్ : పెట్రోల్, డీజిల్ పన్నులపై కేంద్రానికి భారీ ఎత్తున ఆదాయం వచ్చింది. మార్చి 31, 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పెట్రోల్, డీజిల్ పన్నులు, సుంకాలు, సెస్ ల రూపంలో కేంద్రానికి 4.55 లక్షల కోట్ల దాక ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రామేశ్వర్ రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు. ఇదే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు 2.02 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. అత్యధికంగా మహారాష్ట్రకు ఆదాయం వచ్చినట్టు తెలిపారు.