పల్లెవెలుగువెబ్ : మాజీ ఐఏఎస్ పివి. రమేష్ అరెస్టుకు ఏపీ పోలీసులు యత్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ విచారణలో భాగంగా హైదరాబాద్ లోని పివి. రమేష్ నివాసానికి ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లారు. రమేష్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. ఒక కంపెనీకి రూ.350 కోట్లు విడుదల చేయడం వెనుక ఎవరైనా ఒత్తిడి చేశారా అనే కోణంలో విచారించనున్నారు. అప్పట్లో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా రమేష్ పని చేశారు. ఒకవేళ ఈ కేసులో రమేష్‌ను సాక్షిగా చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో పలువురు అధికారులను కూడా ఏపీ సీఐడీ పోలీసులు ప్రశ్నించనున్నారు.