పేదలపాలిట శాపం… ‘ఓటీఎస్’ : టీడీపీ
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పేదలపాలిట శాపంగా మారిన వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ టీడీపీ మండల నాయకులు దేశం సత్యనారాయణ రెడ్డి,మాజీ జెడ్పిటిసి సీతారామిరెడ్డి,మీడియా కోఆర్డినేటర్ సుభద్రమ్మ, దామోదరం నాగ శేషులు, శ్రీనివాస యాదవ్,దుర్వేసి కృష్ణ యాదవ్ సోమవారంగడివేముల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిడిఓ విజయసింహారెడ్డి, తాసిల్దార్ నాగమణి, ఈఓఆర్డీ ఖాళీక్ భాషకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేదల సొంతింటి కల నెరవేర్చాలి మహోన్నత లక్ష్యంతో దివంగత నేత నందమూరి తారకరామారావు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో తొలిసారిగా గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచీ ఎందరో ముఖ్యమంత్రులు పేదల ఇళ్ల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారని అన్నారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ పేరుతో పేదల నుంచి గృహానికి సంబంధించిన రుణాలను 10,000 రూపాయలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. దశాబ్దాల క్రితం మూడు వేల రూపాయల రుణం తీసుకున్నారు వారు ఇప్పుడు పదివేల రూపాయలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. 1983 నుంచి 2011 వరకు కట్టిన ఇళ్లకు ఉన్న రుణ బకాయిలు ఇప్పుడు వన్టైమ్ సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం అన్యాయమని అన్నారు. అవి కట్టకపోతే పింఛన్ రేషన్ తొలగిస్తామని అనడం సరైన సరైనది కాదన్నారు. 2024 వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూపాయి ఖర్చు లేకుండా రిజిస్టర్ చేసి ఇస్తామని టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టిడిపి నాయకులు పాల్గొన్నారు.